• TG : స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు… – కీలక అప్డేట్…
    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
  • కూల్ డ్రింక్స్ తాగుతున్న వారికి అలర్ట్… ఆరోగ్య నిపుణులు ఏం చెపుతున్నారు…
    కాలంతో సంబంధంలేకుండా శీతల పానీయాల వాడకం పెరిగింది. దాహం వేస్తే ఏం ఆలోచించకుండా సరాసరి కూల్ డ్రింక్ తాగుతున్నారు. అయితే అలా తాగేవారు చాలా ప్రమాదంలో ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ చక్కెరలు వాడతారు. వీటిని రోజూ తీసుకోవడంవల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటికి బదులుగా నిమ్మరసం, కొబ్బరి బోండాం తాగడం ఉత్తమం అంటున్నారు.
  • నాగ్పూర్ లో దారుణం… ప్రాణం తీసిన టీ-షర్టు వివాదం… వివరాల్లోకి వెళ్ళితే…
    కేవలం రూ. 300 టీ-షర్టు కోసం చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసుకుంది. అక్షయ్ సోల్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఓ టీషర్ట్ కొన్నాడు. అది సరిపోకపోవడంతో మిత్రుడైన శుభమ్ హర్నేకు రూ.300కు అమ్మేశాడు. ఈ రూ. 300ను చెల్లించేందుకు శుభమ్ నిరాకరించాడు. దీంతో అక్షయ్, శుభమ్ మధ్య వాగ్వాదం చెలరేగింది. తర్వాత అక్షయ్, అతడి సోదరుడు ప్రయాగ్ సోల్.. కోపంతో శుభమ్ గొంతు కోశారు.
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం… కొత్త ఎత్తుగడలు వేస్తున్న రష్యా…
    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనలు వ్యూహం మార్చినట్లు ఉక్రెయిన్ సైనికులు తెలిపారు. నగరాన్ని ముట్టడించే బదులు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోంది. కొత్త ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంది. భారీ స్థాయిలో పొగమంచు కారణంగా డ్రోన్లతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో రష్యా సైన్యం మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని ఉక్రెయిన్ పేర్కొంది.
  • టిక్ టాక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన…
    ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘సావరిన్ వెల్ష్ఫండ్’ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఆదేశించారు. కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్ ఫండ్ ను టిక్ టాక్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. USAలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీనిపై ఆంక్షలు పెట్టాయి.
  • TG : హైడ్రా ప్రజావాణి… ఒక్కరోజే ఎన్ని ఫిర్యాదులంటే…
    హైడ్రా ప్రజావాణికి సోమవారం ఒక్కరోజే 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు. వీటిని అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు. కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని తొలగించాలని సూచించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో అధికారులు తెలుసుకున్నారు.
  • TG : ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పిలుపు!
    కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయం వైపు నడిపించాలని చెప్పారు.
  • ఎడ్యుకేషన్ నెట్వర్క్ లో No.1గా T-SAT
    దేశంలోనే నెం.1 ఎడ్యుకేషన్ నెట్వర్క్ T-SAT దూసుకుపోతోంది. T-SAT కు యూట్యూబ్ లో 8.08లక్షల సబైబర్లు, 108.8 మిలియన్ వ్యూస్, యూప్, వెబ్ ద్వారా 4 మిలియన్ యూజర్లు ఉన్నారు. TGPSC, కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు కంటెంట్ అందిస్తున్న ఏకైక సంస్థ కేవలం టి-సాట్ మాత్రమే. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, నైపుణ్యరంగాలకు ప్రత్యేకంగా ఐదు యూట్యూబ్ ఛానళ్లతో T-SAT నెట్వర్క్ ముందుకెల్తోంది.
  • యోగా గురువు రాందేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్
    పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని పతంజలి సంస్థపై కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు ఫిబ్రవరి 1న హాజరు కావాలని పాలక్కాడ్ కోర్టు ఆదేశించగా వారు హజరుకాకపోవడంతో.. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
  • ప్రపంచంలోనే ప్రాణాంతకమైన ఉద్యోగం…!
    ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమై ఉద్యోగం ఒకటుందని ఓ యూట్యూబర్… సోషియల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అది ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్నిపర్వతం. అక్కడ పనిచేసే గని కార్మికులు… అందులో వెలువడే విష వాయువులతో రోజు పోరాడాల్సి ఉంటుందట. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు. అక్కడి మేఘాలు కమ్ముకొచ్చి..ఊపిరి తీసే ప్రమాదముందట. ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న సరస్సు కూడా అక్కడ ఉందట.
  • ఎలాన్ మస్క్ చేతిలో యూఎస్ వేతనాల రహస్యం
    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ కు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ యూఎస్ ఫెడరల్ పేమెంట్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చారు. ఈమేరకు అమెరికా మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో మిలియన్ల వ్యక్తుల వేతనాల సమాచారం ఉంటుంది. అలాగే, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, ఇతర సంస్థలకు నిధులు కేటాయించడం మొదలైన విషయాలను డోజ్ పరిశీలించి.. అధ్యక్షుడికి సలహాలు, సూచనలు ఇవ్వాలి.
  • ఆపిల్ ను సాగు రైతుకు పద్మశ్రీ పురస్కారం
    వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ రైతు హారిమన్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. శీతల వాతావరణంలో పండే ఆపిల్ను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కూడా సాగు చేసేలా ఆయన హెఆర్ఎంఎన్-99 అనే కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ ఆపిల్ ను సాగు చేస్తున్నారు.
  • TG : నగరంలో మరో రెండు ఐటీ పార్కులు – మంత్రి శ్రీధర్ బాబు
    హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ శివారులలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
  • నేడు PSLV-C60 కౌంట్గాన్ ప్రారంభం
    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్గాన్ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్గాన్ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్ కు చేరుకోనున్నారు.
  • WHO చీఫ్ భయపడిన దృశ్యం…
    యెమెన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ చేసిన 2 World Health Organization (WHO) చీఫ్ ట్రేడీస్ అధానమ్ భపడుతూ పరుగులు తీసిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ దాడిలో ఆరుగురు వరకు మరణించారని ఆయన తెలిపారు. ఆయన యెమెన్ నుంచి సనా దేశానికి వెళ్లాల్సి ఉంది. మరికాసేపట్లో ప్రయాణానికి సిద్ధం అవుతున్న తరుణంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
  • TG : డ్రగ్స్ పై అవగాహనకు ఆన్లైన్ కోర్సు
    రాష్ట్రంలో విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) ఎడిస్టీస్ ఫౌండేషన్, క్రియాటె ఎడ్యుటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘డ్రగ్-ఫ్రీ-వెలెనెస్’ కార్యక్రమంలో భాగంగా పరస్పర సహకారంతో రాష్ట్రంలో డ్రగ్ను కట్టడి చేసేందుకు యువతకి నమ్మకం కలిగిస్తారు. మత్తుపదార్థాలవల్ల తలెత్తేసమస్యలు, అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే కోర్సు పూర్తి చేసినవారికి టీజీన్యాబ్ ద్వారా సర్టిఫికెట్ అం…
  • AP : సోషల్ మీడియాలోకి అసెంబ్లీ వ్యవహారాలు
    ఇకనుంచి సోషల్ మీడియాలోకి ఏపీ అసెంబ్లీ వ్యవహారాలు రానున్నాయి. అసెంబ్లీకి సంబంధించి ‘ఎక్స్’, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు సమక్షంలో ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ‘జీలెజిస్ఆంధ్ర’ పేరుతో ఉన్న ఖాతాల ద్వారా శాసనవ్యవస్థకు సంబంధించిన సమాచారం జనాలలోకి రానుంది. సభా కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ మాధ్యమం ఎంతగానో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
  • టీటీడీలో తెలంగాణ ఓఎన్డీగా గణేష్ కుమార్
    తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా సి. గణేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లైజన్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లపాటు తిరుమలలో పనిచేస్తారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే వీవీఐపీల ప్రొటోకాల్ బాధ్యతలు చూడటంతోపాటు టీటీడీ నుంచి తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తారు.
  • సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు వినతి
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం                                   రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్                               సింగరేణి CMD బలరాం నాయక్‌కు  దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం సింగరేణి సంస్థ తరఫున ప్రత్యేక క్వార్టర్‌ను కేటాయించాలని సీఎండీకి వినతి పత్రం అందించినట్లు అయన తెలిపారు.
  • వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనమా…
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ                                                రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్ పాత పాల్వంచ  నివాసి  యాకూబ్ పాన్ షాప్  యజమాని యాకూబ్  కుమారుని వివాహ రిసెప్షన్ లో  మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్  కొత్వాల సత్యం, ముత్యాల రమణమూర్తి, సర్ఫరాజ్, గుండు రవి, నరసింహారావు, భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు…
  • కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్ నందు  ఘనంగా ప్రారంభమైన మూడు జిల్లాల స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.     
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా   పాల్వంచ                                       రిపోర్టర్ దుర్గాప్రసాద్              వాసు మెమోరియల్ స్మారక 18వ ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం  నాడు కేటీపీఎస్ ఓ అండ్ ఎం  స్పోర్ట్స్ కార్యదర్శి మహేష్, మరియు  పీలే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ  పోటీల్లో మూడు జిల్లాల నుండి 11 టీంలు పాల్గొన్నాయి.  ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా వాసు మెమోరియల్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని శ్రీనివాస్ మిత్రబృందాన్ని అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ఆటల పోటీల్లో ప్రతి… Read more: కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్ నందు  ఘనంగా ప్రారంభమైన మూడు జిల్లాల స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.