రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ పై తమ మాస్టర్ డైరెక్షన్ ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంకులు వినాలన్న సుప్రీంకోర్టు తీర్పు సిఫార్సు మేరకే ఈ మార్పులు చేసింది.
నోటీసులపై స్పందించేందుకు వారికి 21 రోజులకు తగ్గకుండా సమయం ఇవ్వాలని తెలిపింది.