ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు.

ఆరోగ్యం గురించి యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని సూచనలు చేశారు. పనుల్లో మునిగిపోయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల శరీరంలోని సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.