ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది.

ఆగస్టు 20నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLO)లు ఇంటింటికీ తిరిగి పేర్లను పరిశీలిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 29న ప్రచురిస్తారు.