ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని, SUV మోడల్ ఉరుస్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఉరుస్ ఎస్ఈ మోడల్లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 V8 టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ పవర్టైన్తో కలిసి పనిచేయనుంది. 3.4సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.