భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.

ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్గాన్ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్గాన్ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్ కు చేరుకోనున్నారు.