సీనియర్ సిటిజన్లతో పోలిస్తే యువత పెట్టుబడులపై భిన్నంగా ఆలోచిస్తోందని SBI రీసెర్చ్ తెలిపింది. FDల్లో 47% వృద్ధులవేనని పేర్కొంది.
మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీకే యువత మొగ్గు చూపుతోందని వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సగటు వయసు 32 ఏళ్లకు తగ్గిందని, అందులో 40% మంది 30 ఏళ్లలోపు వారేనంది. 2014లో 4 కోట్లుగా ఉన్న MF హోల్డర్లు 2024కు 19కోట్లకు చేరారని పేర్కొంది.