ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్ లలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు.
నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు ఉండాల్సిందే. వీటిలోని నీరు, విటమిన్లు, మినరల్స్ ఆకలిని సంతృప్తి పరిచి జీర్ణశక్తిని పెంచుతాయి. బీట్రూట్లో నీరు, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. కాజు, బాదం, అవిసెలకు ప్రాధాన్యం తప్పనిసరి.