ఆటో రంగ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2 కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి.

2026 AUG నాటికి డీలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టయోటా, ఫోక్స్వేగన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు విలీనం జరుగుతున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.