ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్యులెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది.
1500 కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కినెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. ఆమెకు 20 వేల డాలర్ల ప్రేజ్ మనీ దక్కింది. ఇన్స్తా గ్రాం లో 1.9 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏఐ ముద్దుగుమ్మను ఫోనిక్స్ ఏఐ సీఈవో మెరియం బెస్సా సృష్టించారు.