అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బైడెన్‌తో భేటీ… కీలక చర్చలు…

అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు.

రెండు దేశాల మధ్య సంబంధాలపై, మరియు రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం.. ఇజ్రాయిల్‌-గాజా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

విల్మింగ్టన్‌లో జరిగిన క్వాడ్‌ సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు ఆస్ట్రేలియా పీఎం, జపాన్‌ ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

ఇండో- పసిఫిక్‌ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో- పసిఫిక్‌ రీజియన్‌లో క్యాన్సర్‌ టెస్టింగ్‌ కోసం 7.5 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించారు మోదీ.

తరువాత న్యూయార్క్‌లోని యూఏ జనరల్ అసెంబ్లీలో ప్యూచర్ సదస్సులో కూడా మోదీ పాల్గొననున్నారు. అదే విధంగా పలువురు వ్యాపార వేత్తలో మోదీ సమావేశమవుతారు.

ఈ సందర్భంగా భారత్‌లో పెట్టుబడుల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

PM @narendramodi participated in the Quad Leaders’ Summit alongside @POTUS @JoeBiden of the USA, PM @kishida230 of Japan and PM @AlboMP of Australia.

During the Summit, the Prime Minister reaffirmed India’s strong commitment to Quad in ensuring a free, open and inclusive… pic.twitter.com/TyOti2Rbc9

— PMO India (@PMOIndia) September 22, 2024