ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఈ వైరసు అంతర్జాతీయ అత్యవసర స్థితిగా WHO ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్లో తాజాగా తొలి కేసు నమోదైంది.

రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి ఎంపాక్స్ నిర్ధారణ అయ్యింది. క్లేడ్ 1 రకానికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడటం ఇదే తొలిసారి అని స్వీడన్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది.