హవాయి ఎయిర్ లైన్స్ ను 1.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలనే అలస్కా ఎయిర్ ప్రతిపాదనను సవాలు చేయకూడదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయించడంతో.. ఇరు సంస్థల విలీనానికి అడ్డంకి తొలగిపోయింది.
ఇది అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట కలిగించే విషయం. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించగల కంపెనీని సృష్టించడంలో అలస్కా ఎయిర్ ఒక అడుగు దూరంలోనే ఉందని తెలుస్తోంది.