నటుడు రామ్ చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. ఈనెల 29న దీన్ని ఆవిష్కరించడానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా బృందం రానుంది.

ఈనేపథ్యంలో నాలుగురోజుల నుంచి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 250 అడుగుల భారీకటౌట్ ను ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో ఇదే అతిపెద్ద కటౌట్ కానుందని అభిమానులు చెబుతున్నారు. కటౌట్ పై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అభిమానులు చెబుతున్నారు.