అక్టోబరు నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రయోగశాలల్లో నాణ్యతలేని 90 ఔషధ నమూనాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రయోగశాలల్లో కనీస ప్రమాణాలు లేని 56 ఔషధ నమూనాలను, రాష్ట్రాల ప్రయోగశాలల్లో 34 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ గుర్తించిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరొక సంస్థ బ్రాండ్ పేరుతో అనధికారికంగా ఔషధాలను తయారు చేసి విక్రయిస్తున్న మూడు నకిలీ మందులు బీహార్ లో వెలుగుచూశాయని పేర్కొంది.