రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. నగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను బైక్కు కట్టేసి ఊరంతా లాక్కెళ్లాడు.

దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బైక్కు భార్యను కట్టడానికి ముందు ఆమెను తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఎప్పుడూ భార్యను కొట్టేవాడని, ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేసేవాడని గ్రామస్థులు చెప్పారు.