ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. ఆయా వర్గాలకు చెందిన మహిళల జీవనోపాధి కల్పనకుగాను ఒక్కొక్కరికీ కనిష్ఠంగా రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది.