అమెరికన్ ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత్ కు మరో 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

భారత్ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు 100కిపైగా దేశాలు భవిష్యత్తులో సంపన్న దేశాలుగా అవతరించడానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటాయని తెలిపింది. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక – 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది.