‘జురాసిక్ వరల్డ్’ సినిమాలో టైర్లులేని ఓ క్యాప్సుల్ కారులో వెళ్లడం చూసి అబ్బురపడ్డాం కదా. ఇప్పుడు సూరత్ కు చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఇలా టైర్లులేని క్యాప్సుల్ కారును తయారుచేశారు.
కరెంటుతో నడిచే ఈ కారును ఒక్కసారి ఫుల్లుగా చార్జీ చేస్తే ఏకధాటిగా 80 కిలోమీటర్ల వరకూ పరుగెడుతుంది. కారు గరిష్ఠ వేగం గంటకు 35 కిలోమీటర్లు. ధర రూ.65 వేలు.