కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని తెలిపారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయం వైపు నడిపించాలని చెప్పారు.