తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ రిపీట్ మోడ్లో చూశానని విజయ్ సేతుపతి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ పదేపదే చూశాను.
అందులో ప్రతి సన్నివేశం నాకు గుర్తే. ఆ సినిమాలో భావోద్వేగాలను త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు. మహేశ్ – త్రిషల మధ్య రొమాన్స్.. బ్రహ్మానందం కామెడీ నాకు ఇష్టం’ అని చెప్పారు.