శబరిమల దర్శన అనుభవాన్ని మెరుగుపరచడానికి కేరళలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’AI చాట్బాట్ ను ప్రారంభించారు.

శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు, భద్రత అందించడమే లక్ష్యంగా ఈ చాట్బాట్ ను అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చాట్బాట్ అందిస్తుంది.