కేవలం రూ. 300 టీ-షర్టు కోసం చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసుకుంది. అక్షయ్ సోల్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఓ టీషర్ట్ కొన్నాడు.
అది సరిపోకపోవడంతో మిత్రుడైన శుభమ్ హర్నేకు రూ.300కు అమ్మేశాడు. ఈ రూ. 300ను చెల్లించేందుకు శుభమ్ నిరాకరించాడు. దీంతో అక్షయ్, శుభమ్ మధ్య వాగ్వాదం చెలరేగింది. తర్వాత అక్షయ్, అతడి సోదరుడు ప్రయాగ్ సోల్.. కోపంతో శుభమ్ గొంతు కోశారు.