ఆయుష్ విభాగం రాష్ట్రంలో 842మంది యోగా శిక్షకులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 421 ఆయుష్ చికిత్సాలయాలలో ఒక్కోచోట ఒక మగ ట్రైనర్, ఒక మహిళా శిక్షకురాలు స్థానికులకు ఆసనాలను నేర్పించేలా కార్యాచరణ ప్రారంభించింది.

ఇప్పటికే 628మంది ఆయా కేంద్రాల్లో యోగా నేర్పిస్తున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ముందుగా తెలంగాణలో ప్రారంభమైంది.