గ్రూప్ యాడింగ్ కు సంబంధించి ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దూరం చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
మీ కాంటాక్ట్ లో లేని వ్యక్తి మిమ్మల్ని ఓ గ్రూపులో యాడ్ చేసినప్పుడు అతడి పేరు తెలిపే కాంటెక్స్ట్ కార్డ్ మీకు కనిపిస్తుంది. ఆ గ్రూప్ ను ఎవరు క్రియేట్ చేశారు వంటి వివరాల ఆధారంగా ఆ గ్రూప్ లో ఉండాలా? లేదా అనేది మీరే నిర్ణయం తీసుకోవచ్చు.