పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారట. అర్జునుడి పాత్రలో విజయ్ నటిస్తున్నారట.