రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనలు వ్యూహం మార్చినట్లు ఉక్రెయిన్ సైనికులు తెలిపారు. నగరాన్ని ముట్టడించే బదులు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోంది.

కొత్త ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంది. భారీ స్థాయిలో పొగమంచు కారణంగా డ్రోన్లతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో రష్యా సైన్యం మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని ఉక్రెయిన్ పేర్కొంది.