ప్రముఖ స్మార్ట్ఫోన్ ల తయారీ సంస్థ మోటోరొలా దూకుడు మీద ఉంది. వరుసపెట్టి ఫోన్లను విడుదల చేస్తోంది. ఎడ్జ్ సిరీస్లో ఫోన్లను తీసుకొచ్చిన ఆ కంపెనీ.. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో జీ సిరీస్లో జీ85 పేరిట మరో 5జీ ఫోన్ను లాంచ్ చేసింది.
మోటో జీ85 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999గా పేర్కొంది.