దేశానికి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లు పూర్తయిను సందర్భాన్ని పురస్కరించుకుని 77 మంది మహిళా పైలెట్లను చేర్చుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. దీంతో సంస్థలో మొత్తం మహిళా పైలెట్ల సంఖ్య 800 మించింది.

కొత్తగా చేర్చుకున్న 77 మందిలో 72 మంది ఎయిర్బస్ విమానాలు, అయిదుగురు ఏటీఆర్ విమానాలు నడుపుతారని ఇండిగో తెలిపింది. సంస్థలోని పైలట్లలో మహిళా పైలెట్లకు సంబంధించి అంతర్జాతీయ సగటు 7-9% కాగా, ఇండిగోలో 14 శాతానికి చేరినట్లు వెల్లడించింది.