రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అన్ని రకాలవి కలిపి అక్టోబరు ఆఖరు నాటికి ఏకంగా 41.86లక్షల వాహనాల ‘జీవితకాలం’ ముగిసింది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఏకంగా 31.36 లక్షలు ఉన్నాయి.
ఆ తర్వాత అన్ని రకాల కార్లు కలిపి 5,53,777 ఉన్నాయి. రహదారి ప్రమాదాల్లో నిత్యం 20మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాల్లో ఫిటెనెస్ లేని వాహనాల ప్రభావం కూడా ఉంది.