హైదరాబాద్ లో 25 హౌసింగ్ ప్రాజెక్టుల (6,169ఫ్లాట్లు/ఇళ్లు) పనులు మధ్యలో నిలిచిపోయాయని డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్తోక్విటీ తెలిపింది.
దేశంలోని 42 నగరాల్లో ఇలాంటివి 1,981 గృహ ప్రాజెక్టులు(5.08లక్షల ఇళ్లు/ ఫ్లాట్లు) ఇలానే ఆగిపోయాయని వెల్లడించింది. డెవలపర్ల ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు వారికి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. 2018లో 4,65,555 ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోగా.. తాజాగా ఈ సంఖ్య 5,08,202కు పెరిగినట్లు వివరించింది.