అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తాజాగా AP విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది.

డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే తెలంగాణ విద్యార్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. AP ప్రభుత్వం అభ్యర్థిస్తే నోటిఫికేషన్ లో మార్పులు చేస్తామని వర్సిటీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా నిర్ణయం తీసుకుంటేనే అక్కడి విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది.