భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
రిపోర్టర్ : దుర్గా ప్రసాద్
కేఎల్ఆర్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న పి వెంకట రమేష్ కు అత్యంత విద్యా సలహాదారుగా అవార్డుతో గౌరవింపబడ్డారు. ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారాప్రతిష్టాత్మకమైన మోస్ట్ ఎడ్మి రడ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు లభించింది.
డిసెంబర్21.2024 న హైదరాబాదులోని తాజ్ డెక్కన్ లో జరిగిన ఫ్రైడ్ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలో ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నాడు.
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బంగారు లక్ష్మణ్ మరియు పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏ లెగసి ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ అకాడమిక్ గైడెన్స్ గా పి వెంకట రమేష్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలోఆదర్శప్రాయమైన సేవలను అందించారు.
ఆసియా టుడే ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ గుర్తింపు. అతని అచంచలమైన నిబద్ధత అంకితభావం మరియు అకాడమిక్ ల్యాండ్ స్కేవ్ పై గణనీయమైన ప్రభావాన్ని గుర్తించి అకాడమిక్ ఎక్సలెన్స్ లో నిజమైన నాయకుడిగా అతనిని గౌరవించినది.
ఈ సందర్భంగా కె.ఎల్.ఆర్ విద్యాసంస్థల చైర్పర్సన్ కె నాగమణి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.