ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమై ఉద్యోగం ఒకటుందని ఓ యూట్యూబర్… సోషియల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు.

అది ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్నిపర్వతం. అక్కడ పనిచేసే గని కార్మికులు… అందులో వెలువడే విష వాయువులతో రోజు పోరాడాల్సి ఉంటుందట. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు.

అక్కడి మేఘాలు కమ్ముకొచ్చి..ఊపిరి తీసే ప్రమాదముందట. ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న సరస్సు కూడా అక్కడ ఉందట.