BRS ప్రభుత్వం నుంచి తమకు వారసత్వంగా అప్పులు, బకాయిలు మాత్రమే వచ్చాయని మంత్రి సీతక్క తెలిపారు. శాసనసభలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అని వ్యాఖ్యానించారు.
నాటి ఆర్థికమంత్రి హరీశ్ రావు ఒక్క సంతకం పెడితే… నేడు పంచాయతీలకు పెండింగ్ బకాయిలు ఉండేవి కావన్నారు. గ్రామాలలో కొన్నిసమస్యలు ఉన్నాయన్న విషయం తమకు తెలుసని… వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.