స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతున్న తరుణాన… ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది.
ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. స్వాతంత్య్ర సంబరాలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది. ప్రభుత్వ ఐడీ కార్డుతో రైల్లోకి ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది.