వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక రీఛార్జి వోచర్లను తీసుకురావడంపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2012 పేరుతో సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం స్పెషల్ టారిఫ్, కాంబో వోచర్లకు ఉన్న 90 రోజుల గరిష్ఠ చెల్లుబాటు కాలాన్ని పొడిగించడాన్ని పరిశీలించనుంది.