అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ కు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ యూఎస్ ఫెడరల్ పేమెంట్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చారు.
ఈమేరకు అమెరికా మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో మిలియన్ల వ్యక్తుల వేతనాల సమాచారం ఉంటుంది. అలాగే, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, ఇతర సంస్థలకు నిధులు కేటాయించడం మొదలైన విషయాలను డోజ్ పరిశీలించి.. అధ్యక్షుడికి సలహాలు, సూచనలు ఇవ్వాలి.