అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు 2023లో 13% పెరిగి $91.4 బిలియన్లకు చేరినట్లు ICAN సంస్థ వెల్లడించింది.

2022తో పోలిస్తే ఖర్చు $10.7 బిలియన్లు పెరిగిందని తెలిపింది. US గరిష్ఠంగా $51.5 బిలియన్లు, చైనా $11.9 బిలియన్లు, రష్యా $8.3 బిలియన్లు వెచ్చించాయి. ఇక భారత్ $2.7 బిలియన్లు ఖర్చు చేయగా, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ $1 బిలియన్ వెచ్చించింది. కాగా ప్రస్తుతం తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.