గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు 20ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ఫ్రూట్ ఫ్లై) జాతికి చెందిన 10ఆడ, 10మగ ఈగలు గగన్యోన్ లో పయనం కానున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను పరిశీలించేందుకు ఇస్రో ఈ ఆలోచన చేసింది.