అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది.

విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ అమెరికన్లు ఎగబడి కొంటున్నారు. అధ్యక్షుడిగా తన పదవీకాలం, ప్రచార సమయంలోని విశేషాలను ట్రంప్ దీనిలో పొందుపరిచారు.