రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకూ రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, ఆమోదం రాగానే అమలుచేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రైవేటుసంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.