భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
రిపోర్టర్ దుర్గాప్రసాద్
తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వే అధికారులు సర్వేను వేగవంతం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు శనివారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు కమీషనర్ K సుజాత ను కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాల్లో ఇచ్చిన పేదలకు 5 లక్షలతో ఇంటి నిర్మాణానికి సాయం హామీ మేరకు ప్రజాపాలన సభలలో దరఖాస్తులు స్వీకరించిందన్నారు. మంజూరు విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వే టీం చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు.
లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు — కొత్వాల
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుని వివరాలు సేకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారనీ, సర్వేలో ఆలస్యమైనా ఆందోళన చెందవద్దనీ కొత్వాల అన్నారు. లబ్ధిదారుని ఇంటి స్థలంకు సంబందించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకున్నా సాదాబైనామా, ఎగ్రీమెంట్ డాక్యూమెంట్లతో మంజూరు చేసేలా అధికారులను కోరామన్నారు. దరఖాస్తుదారు అడ్రస్ దొరకక పోయినా, దానిపై విచారించి ప్రతి ఒక్క దరఖాస్తును సర్వే చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు.
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, LDM కోఆర్డినేటర్ బద్ది కిషోర్, మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, కాపా శ్రీను, SK చాంద్ పాషా, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్, తదితరులు పాల్గొన్నారు.