అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు, ఎప్స్టీన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తాననీ ట్రంప్ హామీ ఇచ్చారు.