మేషం

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు.

వృషభం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

మిథునం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల కారణంగా ఆస్తి సమస్య ఒకటి ఒక కొ లిక్కి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. వాగ్దానాలకు హామీలకు ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం

ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం
మంచిది.

సింహం

ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మానవద్దు.

కన్య

అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్ధలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

తుల

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో బద్ధకాన్ని దరిచేరనీయకండి. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ధనుస్సు

మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృతగుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

మకరం

అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కుంభం

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు
రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

మీనం

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని
పంచుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)