మేషం

మనః స్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

వృషభం

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

మిధునం

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.

కర్కాటకం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే ఫలితాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

సింహం

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

కన్య

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా.
చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శ్రేయస్కరం.

మకరం

విశేషమైన శుభఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం చదవాలి.

కుంభం

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

మీనం

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)