మేషం

మంచి సమయం. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృషభం

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

మిధునం

ప్రారంభించి పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ వేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

కర్కాటకం

ధర్మసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం

అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

కన్య

నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

తుల

కొన్ని కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభకరం.

వృశ్చికం

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు.

ధనుస్సు

బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి..

మకరం

ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం ఇతర విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గాస్తోత్రం చదవాలి.

కుంభం

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది

మీనం

మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులో చంద్రబలం అనుకూలంగా లేదు. మీచుట్టూ గిట్టనివాళ్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త.
చంద్ర ధ్యానం శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)