మేషం

మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. దేహసౌఖ్యం ఉంది. ధనాగమన సిద్ధి కలదు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం

చేపట్టే పనులలో చంచల స్వభావం రానీయకండి ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

మిధునం

దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. | మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

కర్కాటకం

మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతమవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పని చేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.

కన్య

మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో
సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

తుల

అనుకూలమైన కాలం కాదు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయవద్దు. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం

తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. శరీర సౌఖ్యం ఉంది. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ఓర్పు అవసరం ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో శ్రీ విష్ణు ఆరాధన చేస్తే మంచిది. సూర్య ఆరాధన శుభదాయకం.

మకరం

తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. మంచి భోజన సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కుంభం

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన
మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయవద్దు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మీనం

హుషారుగా పనిచేయండి. స్థిరమైన నిర్ణయాలు మంచినిస్తాయి. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఇష్టదైవారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)