మేషం

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.
చంద్ర ధ్యానం శుభప్రదం.

మిధునం

కుటుంబ సౌఖ్యం కలదు. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్ధికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివనామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

కర్కాటకం

అనుకూల ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో అంటీ ముట్టనట్టు ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

సింహం

స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయసహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామాన్ని చదవడం మంచిది.

కన్య

మంచి ఫలితాలను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

తుల

చేపట్టే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం

ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యం పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

ధనుస్సు

ధర్మచింతనతో వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఇష్టదేవత ఆరాధన శుభదాయకం.

మకరం

కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటలు ఎదురైనా సిద్ధిస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

కుంభం

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.

మీనం

తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)