సినిమా అవార్డ్స్ లలో ఆస్కార్ అవార్డులకు ప్రపంచంలోనే మొదటి స్థానం అని మనకు తెలుసు.
ఆస్కార్ అవార్డులను మొదటగా అకాడమీ అవార్డులుగా పిలిచేవారు.
ఈ అవార్డులను 1929 లో అమెరికాలో ప్రారంభించారు. ఈ అవార్డ్స్ ని 1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను పేరును ఆస్కార్ అని మార్చారు.
ఈ అవార్డ్స్ ని ప్రారంభించడానికి అసలు కారణం :
1929 లో అమెరికాలో ఆర్థిక మాంద్యం కారణంగా సినీ పరిశ్రమను కాపాడటానికి, నటీ – నటులతో, రైటర్స్ తో, డైరెక్టర్స్ తో, మరియు కార్మికులతో సత్సంబంధాలు కొనసాగించడానికి Metro Goldwyn Mayer అనే production సంస్థ ఈ అవార్డులను ప్రారంభించింది.
1956లో మొట్టమొదటిగా Best Foreign Language Film క్యాటగిరిని ప్రారంభించారు. అప్పటి వరకు ఈ అవార్డులను ఎక్కువగా అమెరికా వారికే ఇచ్చే వారు.
దీనిలో 22 క్యాటగిరిలు ఉంటాయి.
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటి
- ఉత్తమ నటుడు
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ సంగీతం
- మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్
- ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్
- ఉత్తమ సినిమాటోగ్రఫీ
- ఉత్తమ సౌండ్ ఎడిటింగ్
- ఉత్తమ సౌండ్ మిక్సింగ్
- ఉత్తమ సహాయనటి
- ఉత్తమ సహాయ నటుడు
- ఉత్తమ యానిమేషన్ చిత్రం
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
- ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్)
Holiwood కి సంబంధించి ముఖ్యంగా Top 5 క్యాటగిరిలు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ నటి
- ఉత్తమ స్క్రీన్‌ప్లే
వీటినే Big 5 అంటారు.
Part – II లో ఈ అవార్డుకు ఏవిధంగా ఎన్నిక చేస్తారో తెలుసుకుందాం…. అంతవరకు మిగితా న్యూస్ చదవండి..